Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేకప్ వేసుకోకపోతే యాంకర్ సుమ ఇలా ఉంటుంది!

  • మేకప్ వేసుకోకుండా తీసుకున్న వీడియో పోస్ట్ చేసిన సుమ
  • గత రాత్రి 'క్యాష్' ప్రోగ్రామ్ లో పాల్గొన్నానన్న యాంకర్
  • అభిమానుల కోసమైనా మేకప్ వేసుకొని పనిచేయాలనిపిస్తుందని వ్యాఖ్య
టాప్ యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు వారు ఎవరూ లేరు.. వేదికపై తనదైన శైలిలో చమక్కులు వదిలే ఆమె మాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు.  పెద్ద సినిమాల ఆడియో ఫంక్షన్లు జరిగితే వేదికపై ఆమె కనపడాల్సిందే. సోషల్ మీడియాలోనూ సుమ చురుకుగా ఉంటుంది. ఇప్పటికే 'సుమక్క' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది.
                                
యూట్యూబ్‌లో పలు ప్రయోగాత్మక వీడియోలు పోస్టు చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఏ మాత్రం మేకప్‌ వేసుకోకుండా ఆమె కనపడి పలు విషయాలు చెప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. గత రాత్రి తాను 'క్యాష్' ప్రోగ్రామ్ లో పాల్గొన్నానని, ఆ మరుసటి రోజు తాను ఇలా ఉన్నానని ఆమె చెప్పింది. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఫ్యాన్స్ తనకు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడింది. అభిమానుల కోసమైనా మేకప్ వేసుకొని కష్టపడి పనిచేయాలనిపిస్తుందని తెలిపింది.
Suma
Twitter
Instagram
Viral Videos

More Telugu News